ABOUT DIET




జిల్లా విద్యా శిక్షణ సంస్థ చరిత్ర

                       
 మన రాష్ట్ర ప్రభుత్వము  1975-76 సంవసత్సరం ప్రాథమికఉపాద్యాయులకు శిక్షణ ఇచ్చే నిమిత్తము  ,మన రాష్ట్రమున 12 ఉపాద్యాయ  శిక్షణా సంస్థలను నెలకొల్పింది. ఉపాద్యాయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుటకు  ప్రతి  జిల్లాకు ఒక ఉపాద్యాయ శిక్షణ సంస్థ అవసరమనే సత్సంకల్పముతో 1984-85 సంవత్సరములో  అదనంగా 11 ఉపాద్యాయ  శిక్షణా   సంస్థలను ప్రభుత్వము  ప్రారంబించడం  జరిగింది ఆ సందర్బమున  మన అనంతపురం జిల్లాలో ఈ ఉపాద్యాయ శిక్షణ సంస్థ ప్రారంబించడమైనది . 

 
                       జిల్లా కేంద్రమైన  అనంతపురం పట్టణములో ఒక్కప్పుడు బేసిక్ ఉపాద్యాయ శిక్షణ సంస్థ నిర్వహింపబడిన సముదాయములో జి .ఓ .యం. యస్. నెం 168(12).తేది 12-3-84.మేరకు ఈ సంస్థ  16-4-1984 తేదిన  ప్రారంబిచబడినది .


               ఒక విద్యా సంవత్సరము గడిచిన తరువాత  ఈ శిక్షణ  సంస్థ ను అనంతపురం పట్టణము నుండి బుక్కపట్టణమునకు 1-7-1985. వ తేది తరలించడం జరిగింది. .శ్రీ భగవాన్ సత్య సాయి   ట్రస్ట్ వారిచేత నిర్మింపబడిన   నూతన భవన సముదాయములోకి శ్రీ సత్య సాయి జిల్లా పరీషత్  ఉన్నత పాఠశాలను తరలించడం ద్వారా  ఖాళీ ఏర్పడిన పాత భవనాలలో  మన ఉపాద్యాయ  శిక్షణ  సంస్థ నెలకొల్పబడింది.ఈ శిక్షణ  సంస్థయందు 20  బ్యాచ్ల  విధార్థుల శిక్షణ పొంది రాష్ట్ర  స్థాయిలో ఉన్నత పరీక్షా   పలితాలను  సాధించారు.


                ఈ ఉపాద్యాయ శిక్షణ సంస్థ జి .ఓ .యం .యస్ .116తేది 27-3-89. మేరకు జిల్లా విద్యా  శిక్షణ సంస్థ గా అభివృద్ది చేయబడినది .1986సంవత్సరము లో మన భారత ప్రభుత్వం విధ్యా  రంగములో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టుటకై  జాతీయ విధ్యావిధానమున ప్రవేశపెట్టినది .ఈ విధ్యావిధానము సాధించదలచిన ప్రధాన లక్ష్యాలలో  ప్రాథమిక విధ్యను సార్వజనీనము చేయుట ,వయోజనులలో నిరక్షరాస్యతను నిర్మ్లించుట అను అంశములు ప్రధానమైనవిగా భావించవచ్చును ఈలక్ష్యాల సాధనకు జాతీయ స్థాయిలో యెస్  సి .ఇ .ఆర్ .టి .మరియు యెస్ ఐ .పి .ఆ .లు.రాష్ట్ర స్థాయిలో  యెస్ .సి .ఇ ఆర్ .టి మరియు యెస్ .ఆర్ .సి .లు కృషి చేయగా జిల్లా స్థాయిలో డి .ఐ .ఇ .టి .కృషి చేస్తున్నాయి .


                       జిల్లా విద్యా శిక్షణా  సంస్థ లు జిల్లాలోని ప్రాథమిక ఉపాధ్యాయులకు  కావలసిన విద్యా విషయక సలహాలను విద్యావనరులను అందచేస్తూ ఉపాధ్యాయులను వృత్తి విద్యా నైపుణ్యములు  ,సామర్థ్యాములతో పాటు వృత్తి పరమైన నైతిక విలువలను అభివృద్ధి చేయుటకు    కృషిచేస్తున్నాము . ఈలక్ష్యాల సాధనలో మన విద్యా శిక్షణ సంస్థ నిరంతరము కృషి చేస్తు ముంధుకు సాగిపోతున్నది.
  

                       జిల్లా విద్యా శిక్షణ సంస్థ నూతన భవనము (బుచ్చయ్యు గారి పల్లికి  1కిమీ  ధూరములో) ముదిగుబ్బ రోడ్డులో నిర్మించబడినది ,12-06-2007.తేది నుండి నూతన భవనంలో నడుపబడుచున్న సంస్థలో ప్రహరీగోడ మీద మంచి సూక్తులు వ్రాయించి విలువలకు అద్దంపట్టే విధంగా తీర్చిదిద్దడం ఏర్పాటు జరిగింది .విఘ్నేశ్వర, సరస్వతి    విగ్రహాలను దాతలతో ప్రతిశ్టింప జేసిరి  ,దాతల సహాయంతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు . ప్రదానాచార్యులు   శ్రీ కె మునెయ్యు గారు నూతన భవనంలో సైకాలజీ ల్యాబ్ ను ఫిజికల్ ఎదుయ్కేకేషన్ ,కంప్యూటర్   ల్యాబ్ లను సైన్స్  ల్యాబ్ లను మొదలగు వాటిని వేర్వేరు  గదులలో నిర్మింపజెసి   కళాశాల దాతల విరాళములతో ధేశనాయకుల బొమ్మలను ఆకర్షనీయంగా గీయించారు.  సంస్థ ప్రాంగణంలో పులమొక్కలు ను ఇతర చెట్లను సిబ్బంది సహాయముతో ప్రాంగనామంత అందముగా ఆకర్షణీయంగా ఉండునట్లు రుపోండించబడినది .సుమారు 20 లక్షలు  రూపాయలతో  సెమినార్ హాల్  మరియు పైన ఒక తరగతి నిర్మించడం  జరిగింది .సంస్థ ప్రాంగణంలో సర్వే పల్లి  రాధాకృష్ణన్ ,సర్స్వతి దేవి ,మహాత్మాగాంధి ,శ్రీ కృష్ణదేవరాయలు ,మదర్ థెరిస్సా ,స్వామివివేకనంద  విగ్రహాలను దాతల సహాయంతో ఏర్పాటు చేశారు .



మన పిల్లన్ని కూర్చోబెట్టి ,వ్యాకరణం చెప్పి ,ప్రతి తప్పును సరిచేస్తూ మాట్లాడటం నేర్పివుటే మన పిల్లలకి మాట్లాడటం ఎప్పటికీ  వచ్చేవికావు – జాన్ హాల్డ్ .


సేకరణ
పెనుగొండ ఆంజనేయులు
                    ఏం.యస్.సి.;బి.ఈ.డి.